ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అటు వైకాపా మూడు రాజధానులు... ఇటు తెదేపా అమరావతి నిరసన..! - ycp meet at naravali palli

ఒకవైపు మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతు.. మరోవైపు అమరావతికి అనుకూలంగా నినాదాలు. ఇదీ ప్రస్తుతం చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో కనిపిస్తోన్న పరిస్థితి. వైకాపా, తెదేపా నేతలు ఎవరికి వారు పోటాపోటీగా సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు గ్రామంలో వైకాపా సభ నిర్వహణపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా తాము కచ్చితంగా సభ నిర్వహిస్తామని వైకాపా నేతలు చెబుతున్నారు.

ycp meet at naravali palli
నారావారిపల్లెలో వైకాపా భహిరంగ సభ

By

Published : Feb 2, 2020, 12:54 PM IST

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో ఉత్కంఠ నెలకొంది. వైకాపా ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతుగా ప్రజా సదస్సును ఇక్కడ నిర్వహించనున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఈ సభ ప్రారంభం కానుంది. ఈ సభలో సుమారు 20 వేల మంది ప్రజలు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ సభలో ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలకు మంత్రులు వివరిస్తారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు.

తెదేపా నేతల ఆగ్రహం

ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత గ్రామంలో మూడు రాజధానుల నిర్ణయానికి అనుకూలంగా సభ పెట్టడంపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నారావారిపల్లి గ్రామస్థులు అమరావతి రైతులకు మద్దతుగా శాంతియుత నిరసన తెలపడానికి చంద్రగిరి పోలీసులను అనుమతి కోరారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. మొత్తంగా నారావారిపల్లెలో వైకాపా సభ, తెదేపా నిరసన కార్యక్రమాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇదీ చదవండి:

హస్తినకు రైతులు.. 'కేంద్రం ఎదుట గోడు చెబుతాం'

ABOUT THE AUTHOR

...view details