చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చినా పాఠాలు నేర్చుకోలేదని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఇంకా మాస్కులు లేకుండా, భౌతికదూరం పాటించకుండా వ్యవహరిస్తున్నారని తప్పుబట్టారు. రాష్ట్రంలో రోజుకు 10 వేల చొప్పున కరోనా కేసులు నమోదవుతుంటే... వైకాపా శాసనసభ్యులు సూపర్ స్ప్రెడర్ల పాత్రను పోషిస్తున్నారని లోకేశ్ దుయ్యబట్టారు. ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు నారా లోకేశ్.
'వైకాపా శాసనసభ్యులు సూపర్ స్ప్రెడర్లు..!' - YCP MLA Dance news
వైకాపా శాసనసభ్యులు సూపర్ స్ప్రెడర్ల పాత్రను పోషిస్తున్నారని నారా లోకేశ్ విమర్శించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చినా పాఠాలు నేర్చుకోలేదని.. ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. మధుసూధన్ రెడ్డి నృత్యం చేస్తున్న ఓ వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు.
లోకేశ్ ట్వీట్
Last Updated : Sep 14, 2020, 6:26 AM IST