చిత్తూరు జిల్లా ములకలచెరువు ఎంపీడీవోను వైకాపా నేతలు బూతులు తిట్టారు. తాము చెప్పిన వారినే వాలంటీర్లుగా నియమించాలని... స్థానిక వైకాపా నేతలు మాధవరెడ్డి, మోహనరెడ్డి ఒత్తిడి చేస్తున్నారని ఎంపీడీవో రమేశ్ బాబు ఆరోపించారు. తన కారును అడ్డగించి దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని బాధితుడు వాపోయారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఎంపీడీవోపై దాడి... చర్చనీయాంశమైన వైకాపా నేత తీరు..! - undefined
వైకాపా నేతల బూతుపురాణం మరోసారి చర్చనీయాంశమైంది. ప్రభుత్వ అధికారి అని చూడకుండా... ఓ ఎంపీడీవోను బూతులు తిట్టారు. వాహనాన్ని అడ్డగించి దాడికి దిగారని బాధిత ఎంపీడీవో ఆరోపించారు.

ప్రభుత్వ అధికారిని బూతులు తిట్టిన వైకాపా నేతలు
ఎంపీడీవోపై దాడి... చర్చనీయాంశమైన వైకాపా నేత తీరు..!