చిత్తూరు జిల్లా పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పం మండలం వెండుగాంపల్లిలో వైకాపా మద్దతు అభ్యర్థులకు ఓటేయాలంటూ.. వైకాపా నాయకులు బహిరంగంగానే అభ్యర్థిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిలబడి.. ప్రభుత్వ పథకాలు కావాలంటే.. అధికార పార్టీ మద్దతు అభ్యర్థికే ఓటు వేయాలంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. కరపత్రాలను చూపిస్తూ.. వైకాపా నాయకులు బాహాటంగానే ఓటర్లను ప్రాధేయపడుతున్నా.. అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది మాత్రం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
రూలింగ్ పార్టీ.. గుర్తు పెట్టుకో... - ycp leaders offers update
పోలింగ్ కేంద్రాల వద్దే.. వైకాపా నేతలు ప్రలోభాలకు దిగారు. ఓటర్లకు కరపత్రాలు చూపిస్తూ.. వైకాపా మద్దతు అభ్యర్థులకే ఓటు వేయాలని కోరుతున్నారు.
వైకాపా నేతల ప్రలోభాలు