చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో తెదేపా నేతలపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బి.కొత్తకోటలో మరణించిన తెదేపా కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దాడిలో పలువురు తెదేపా కార్యకర్తలు గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైకాపా శ్రేణుల దాడిలో తెదేపా నేతలకు చెందిన 4 కార్లు ధ్వంసమయ్యాయి.
అంగళ్లులో ఉద్రిక్తత...తెదేపా నేతలపై వైకాపా కార్యకర్తలు దాడి - టీడీపీ తాజా వార్తలు
![అంగళ్లులో ఉద్రిక్తత...తెదేపా నేతలపై వైకాపా కార్యకర్తలు దాడి అంగుళ్లులో ఉద్రిక్తత.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9839898-716-9839898-1607671491664.jpg)
11:58 December 11
చిత్తూరు జిల్లా అంగళ్లులో వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. ఓ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న తెదేపా నేతలు శ్రీనివాసరెడ్డి, కిశోర్‌కుమార్ రెడ్డిలపై దాడికి పాల్పడ్డి వారి కార్లు ధ్వంసం చేశారు. ఈ దాడిలో తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
రాజంపేట తెదేపా నేత శ్రీనివాసరెడ్డి, పీలేరు తెదేపా నేత కిశోర్‌కుమార్‌రెడ్డి కార్లు ధ్వంసం అయ్యాయి. 'ఈనాడు' ప్రతినిధి చరవాణి, కెమెరాను వైకాపా కార్యకర్తలు లాక్కున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోకి భారీగా తెదేపా, వైకాపా కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో భారీగా పోలీసులను మోహరించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. తెదేపా నేతల ఆందోళనతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి :