ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళా గ్రామ వాలంటీర్​పై వైకాపా నేతల దాడి - చిత్తూరులో మహిళా వాలంటీర్​పై వైసీపీ నేతల దాడి న్యూస్

చిత్తూరు జిల్లాలో ఓ మహిళా గ్రామ వాలంటీర్​పై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. తమ ఇంటికీ ఎందుకు నీరు సరఫరా చేయడం లేదని ప్రశ్నించినందుకు దాడి చేసినట్లు బాధితురాలు తెలిపారు.

ycp leaders attack on women village volunteer in chittoor
ycp leaders attack on women village volunteer in chittoor

By

Published : May 24, 2020, 3:15 PM IST

చిత్తూరు జిల్లా కలకడ మండలం నవాబ్ పేట దళిత వాడ గ్రామ మహిళా వాలంటీర్​పై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. గ్రామంలో అందరికీ ట్యాంకర్​తో నీటిని అందించి తమ ఇంటికి మాత్రమే నీటిని సరఫరా చేయటం లేదు ఎందుకని ప్రశ్నించినందుకు... దాడికి పాల్పడ్డారని పోలీసులకు వాలంటీర్​ ఫిర్యాదు చేశారు. కర్రలు, రాళ్లతో ఇంటిపై దాడికి దిగి సామగ్రి ధ్వంసం చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకూ తన కుటుంబ సభ్యులకు తీవ్రగాయాలయ్యాయని... న్యాయం చేయాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details