పార్టీలో గుర్తింపులేదని, స్థానిక నాయకులూ కనీస మర్యాద కూడా ఇవ్వడంలేదంటూ చిత్తూరు జిల్లా(chittoor district) మదనపల్లెకు చెందిన వైకాపా మహిళ నాయకురాలు, మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ సెల్వి నిరసనకు(ycp leader protest) దిగారు.
వైకాపా మహిళా నేత మౌనదీక్ష.. సీఎంతో తప్ప ఎవరితోనూ మాట్లాడబోనని నిరసన - చిత్తూరు న్యూస్
చిత్తూరు జిల్లాల మదనపల్లెలో వైకాపా నాయకురాలు(ycp leader protest) నిరసన చేపట్టారు. పార్టీలో తనకు కనీస మర్యాద కూడా ఇవ్వటం లేదని వాపోయారు. సీఎం జగన్‌తో తప్ప తాను ఎవరితోనూ మాట్లాడబోనని భీష్మించుకుని కూర్చున్నారు.
protest
మదనపల్లె పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం ఎదుట మౌనదీక్ష చేపట్టారు. తాను పార్టీకి విధేయురాలునని తన సమస్యలను ముఖ్యమంత్రికి మాత్రమే తెలియజేస్తానన్నారు. సీఎం జగన్‌తో తప్ప తాను ఎవరితోనూ మాట్లాడబోనని భీష్మించుకుని కూర్చున్నారు.
ఇదీ చదవండి