ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశువుల మేత భూమిపై అక్రమార్కుల కన్ను.. వారి అండతోనే అంటున్న స్థానికులు - పూతలపట్టు మండలం తహసీల్దార్​

Ysrcp Leaders Land Occupation: చిత్తూరు జిల్లాలో భారీ భూ ఆక్రమణకు కొంతమంది యత్నించారు. ఇది గమనించిన స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారమివ్వడంతో వారి ప్రయత్నం విఫలమైంది. భూకబ్జాకు యత్నించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అయితే వైకాపా నేతల అండదండలతోనే కబ్జాకు యత్నించారని స్థానికులంటున్నారు.

Land Occupation
భూ ఆక్రమణ

By

Published : Oct 26, 2022, 5:02 PM IST

Ysrcp Leaders Land Occupation: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి. కొత్తకోట పంచాయతీ తిరుమల కొండయ్యగారిపల్లిలో భారీ భూ ఆక్రమణకు కొంతమంది యత్నించారు. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 1373, 1374లో సుమారు 17 మంది 120 ఎకరాల గుట్ట ప్రాంతంలోని పశువుల మేత భూమిని కబ్జా చేయడానికి యత్నించారని.. వీరికి వైకాపా నాయకుల అండదండలున్నాయని స్థానికులు ఆరోపించారు. ఈ విషయాన్ని తహసీల్దార్ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. అధికారులు అక్కడకు చేరుకుని భూ ఆక్రమణను అడ్డుకున్నారు. అనంతరం ఆర్డీవో రేణుక సంఘటనా స్థలాన్ని పరిశీలించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణలకు యత్నించిన 17 మందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్థానిక తహసీల్దార్ విజయభాస్కర్ తెలిపారు.

పశువుల మేత భూమిపై అక్రమార్కుల కన్ను

ABOUT THE AUTHOR

...view details