వైకాపా నాయకులు ఇళ్ళ స్థలాల మంజూరు ముసుగులో భూ దందాలు చేస్తున్నారని.. చంద్రగిరి నియోజకవర్గ తెదేపా నాయకులు ఆరోపించారు. గత ప్రభుత్వం పేదలు సాగు చేసుకోవడానికి ఇచ్చిన భూములు ఇప్పుడు ఇంటిస్థలాలుగా మారుతున్నాయన్నారు. ప్రభుత్వం పెద్దలకు ఇచ్చిన భూములు వదిలి, పేదలకు ఇచ్చిన భూమినే ఇంటి స్థలాలకు కేటాయించడం అన్యాయమన్నారు. భూ పంపిణీ విషయంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు.
'పేదలకు ఇళ్ల స్థలాల ముసుగులో వైకాపా భూ దందా' - పేదలకు ఇళ్ల స్థలాల ముసుగులో వైకాపా భూదందా
ప్రభుత్వం పెద్దలకు ఇచ్చిన భూములు వదిలి, పేదలకు పంచిన భూమినే ఇళ్ల స్థలాల కోసం కేటాయించడం అన్యాయమన్నారు చిత్తూరు జిల్లా చంద్రగిరి తెదేపా నేతలు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు.
పేదలకు ఇళ్ల స్థలాల ముసుగులో వైకాపా భూదందా