suicide attempt: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో వైకాపా కార్యకర్త వెంకటేష్ ఆచారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పనపాకం పంచాయతీ కొత్తపేటలో తన ఇంటి పక్కనే కొన్న స్థలాన్ని స్థానిక వైకాపా నేతల సాయంతో కొందరు ఆక్రమించుకుంటున్నారని సెల్ఫీ వీడియోలో ఆరోపించారు. పనపాకం గ్రామంలో నాయకుల హామీతో రోడ్డు పనులు చేస్తే రూ.6 లక్షలు అప్పులు మిగిలాయని వాపోయారు.
Suicide Attempt: చిత్తూరు జిల్లాలో వైకాపా కార్యకర్త ఆత్మహత్యాయత్నం.. వీడియో వైరల్ - చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వైకాపా కార్యకర్త ఆత్మహత్యాయత్నం
09:08 March 21
తన స్థలాన్ని వైకాపా నాయకుల సాయంతో కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపణ
రెవెన్యూ, పోలీసు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో మనోవేదన గురయ్యానని పురుగుల మందు డబ్బా చేతబట్టుకుని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. నా చావుకు అధికారులు, కొందరు స్థానిక నేతలే కారణమని ఆరోపించారు. సెల్ఫీవీడియోను కుటుంబసభ్యులు, స్నేహితులకు పంపించారు. విషయం తెలుసుకున్న చంద్రగిరి పోలీసులు.. బాధితుడు వెంకటేష్ కోసం పనపాకం అడవుల్లో గాలిస్తున్నారు.
ఇదీ చదవండి:
Save Me: పోలీసుల నుంచి కాపాడండి.. జిల్లా ఎస్పీకి ఓ వ్యక్తి ఫిర్యాదు