ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా బైక్ ర్యాలీ.. గురుమూర్తిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి - Tirupathi By-poll news

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైకాపా ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ఉపఎన్నికలో వైకాపా అభ్యర్థి గురుమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేతలు కోరారు.

వైకాపా బైక్ ర్యాలీ
వైకాపా బైక్ ర్యాలీ

By

Published : Apr 6, 2021, 4:20 PM IST

తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా నేతలు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ద్వారకనాథరెడ్డి, వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ఆధ్వర్యంలో రేణిగుంట మండలం నుంచి శ్రీకాళహస్తి వరకు ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాలపై ర్యాలీ చేపట్టారు. ఉపఎన్నికల్లో తమ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ABOUT THE AUTHOR

...view details