ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పవన్ పర్యటనను అడ్డుకోవాలని చూడటం దారుణం' - భాజపా నేత కోలా ఆనంద్ వార్తలు

పవన్ కల్యాణ్ తమ గ్రామంలోకి రాకూడదంటూ చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం పోయ గ్రామంలో వైకాపా కార్యకర్తలు నిరసన తెలపడాన్ని భాజపా నేత కోలా ఆనంద్ తప్పుబట్టారు. రైతుల పరామర్శకు వెళ్తున్న పవన్ కల్యాణ్​కు వ్యతిరేకంగా నినాదాలు చేసి... వైకాపా తన రౌడీయిజాన్ని నిరూపించిందని దుయ్యబట్టారు.

bjp leader kola Anand
bjp leader kola Anand

By

Published : Dec 4, 2020, 4:00 PM IST

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైకాపా దౌర్జన్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని భాజపా నేత కోలా ఆనంద్ విమర్శించారు. పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ తమ గ్రామంలోకి రాకూడదంటూ జిల్లాలోని తొట్టంబేడు మండలం పోయ గ్రామంలో వైకాపా కార్యకర్తలు నిరసన తెలపడాన్ని ఆనంద్ తప్పుబట్టారు. పవన్ పర్యటనను అడ్డుకోవాలని చూడటం దారుణమని... దేశం పౌరులకు ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉందన్నారు. రైతుల పరామర్శకు వెళ్తున్న పవన్ కల్యాణ్​కు వ్యతిరేకంగా నినాదాలు చేసి... వైకాపా తన రౌడీయిజాన్ని నిరూపించిందని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details