ఉత్తర భారత యాత్ర, దక్షిణ భారత యాత్ర పేరుతో రెండు సర్వీసులను నడపనున్నట్లు ఐఆర్సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ సంజీవయ్య తెలిపారు. మార్చి10 నుంచి 20 వరకు ఉత్తర భారత యాత్ర ఆగ్రా, ఢిల్లీ, అమృతసర్ల మీదుగా ప్రయాణం సాగనుందన్నారు. రేణిగుంట నుంచి ప్రారంభమయ్యే ఈ రైలులో...స్లీపర్ క్లాస్ ధర రూ.9925 కాగా ఏసీ 3 సీటర్ ధర రూ.11605 గా నిర్ణయించామన్నారు.
ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాలను కలుపుతూ నూతన రైలు - yathra trains latest news
భారతదేశంలోని ఆధ్యాత్మిక, చారిత్రక పర్యాటక ప్రదేశాలను కలుపుతూ ఐఆర్సీటీసీ నూతన రైలును ప్రారంభించనుంది.
ప్రారంభం కానున్న భారత్ దర్శన్ రైలు
జనవరి నుంచి ఫిబ్రవరి 6 వరకు హంపి, ఉడిపి, గోకరణం వంటి 13 ప్రదేశాల మీదుగా దక్షిణ భారత యాత్ర రైలు ప్రయాణం సాగనుందని ఆయన తెలిపారు. విజయవాడ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలులో...స్లీపర్ ధర రూ.10920 కాగా ఏసీ 3 సీటర్ ధర రూ.13,230గా నిర్ణయించారు. ప్రయాణికులకు ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాల యత్రను అతి తక్కువ ధరలకు అందించడమే దీని ప్రధాన ఉద్దేశమని సంజీవయ్య తెలిపారు.
ఇదీ చదవండి: తిరుమలలో ఉచిత లడ్డు విధానం నేటి నుంచి అమలు