తిరుపతి మహతి కళావేదికలో తితిదే ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. తితిదే ధర్మకర్తల మండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, తితిదే జేఈవో సదా భార్గవి ముఖ్య అతిథులుగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తితిదేలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా ఉద్యోగులకు పద్మావతి అవార్డులను బహుకరించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ సంగీతం, ఏకపాత్రాభినయాలతో పాటు, విభిన్న సామాజిక అంశాలపైన మహిళా ఉద్యోగులు నాటికలను ప్రదర్శించారు.
తిరుపతిలో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవం - తిరుపతి వార్తలు
తిరుపతిలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తితిదేలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా ఉద్యోగులకు అవార్డులను బహుకరించారు.
మహిళా దినోత్సవం