ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తహసీల్దార్ కార్యాలయం వద్ద వాలంటీర్ ఆత్మహత్యాయత్నం

ఇళ్ల స్థలాల్లో అవినీతి కారణంగా చిత్తూరు జిల్లాలో ఓ మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసింది. అర్హులైన వారికి స్థలాలు ఎందుకు కేటాయించలేదని ఆమె అధికారులను ప్రశ్నించింది. అయితే వారి నుంచి సరైన సమాధానం రాలేదని ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నం చేసింది.

women volunteer suicide attempt in chittor distrcit
women volunteer suicide attempt in chittor distrcit

By

Published : Jul 1, 2020, 12:33 PM IST

Updated : Jul 1, 2020, 1:39 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద కస్​పున్నీసా అనే గ్రామ వాలంటీర్‌ ఆత్మహత్యాయత్నం చేసింది. తహసీల్దార్ కార్యాలయం పైనుంచి దూకింది. తీవ్రగాయాల పాలైన ఆమెను స్థానికులు బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బాధితురాలు తస్​మున్నీసా బి.కొత్తకోట బీసీ కాలనీలో వాలంటీర్​గా విధులు నిర్వహిస్తోంది. ఇళ్ల స్థలాల జాబితాలో అర్హులైన వారికి స్థలాలు ఎందుకు కేటాయించలేదని ఆమె అధికారులను ప్రశ్నించింది. అధికారుల నుంచి సమాధానం లేకపోవడం, ప్రతిపాదిత లబ్ధిదారులు ప్రశ్నిస్తుండటంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించిందని సమాచారం.

Last Updated : Jul 1, 2020, 1:39 PM IST

ABOUT THE AUTHOR

...view details