తిరుపతి రూరల్ పరిధిలోని లింగేశ్వరనగర్లో నవవధువు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తిరుపతికి చెందిన అబ్బాయి, తెలంగాణకు చెందిన అమ్మాయి ప్రేమించి వివాహం చేసుకున్నారు. పెళ్లైన ఆరు నెలలకే వారి మధ్య విభేదాలు తలెత్తాయి. భర్త విధులకు వెళ్లిన సమయంలో సునీత బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సరిహద్దులు దాటిన ప్రేమ.. మనస్తాపంతో వివాహిత బలవన్మరణం - news updates in thirupathi
నిండు నూరేళ్లు కలిసి ఉంటామని బాస చేసుకున్నారు. రాష్ట్రాలు వేరైనా ప్రేమకు ఏదీ అడ్డు కాదంటూ వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంలో కలహాలు మొదలయ్యాయి. ఆ విభేదాలను భరించలేక మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తిరుపతిలో జరిగింది.
మనస్తాపంతో వివాహిత బలవన్మరణం