భర్తకు దూరమై..తల్లిదండ్రులకు భారమవుతున్నాననే ఆవేదనతో ఓ మహిళ లారీ కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నించగా పోలీసులు కాపాడారు. చిత్తూరు జిల్లా కొత్తకోటకు చెందిన అమ్మజాన్ భర్తతో గొడవ పడి గత రెండేళ్లుగా కుటాగుళ్లలోని పుట్టింట్లో ఉంటోంది.
తల్లిదండ్రులకు భారమవుతున్నానని భావించిన అమ్మజాన్.. ఇంటి నుంచి వెళ్లిపోయి కౌలేపల్లి వద్ద లారీ కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన కదిరి రూరల్ సీఏ నిరంజన్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.