న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినా ఎలాంటి ఫలితం లేదంటూ...తిరుపతిలో ఓ మహిళ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేసింది. తిరుపతిలోని చిన్నకాపులో తన కుమార్తెతో కలిసి నివాసముంటున్న బాధితురాలు... తన భర్త రెండో వివాహం చేసుకుని ఇబ్బంది పెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల కుమార్తె, తల్లితో కలిసి స్టేషన్ ముందు బైఠాయించింది. చివరికి తూర్పు పట్టణ పోలీసులు వచ్చి.. ఆమెకు నచ్చజెప్పి పంపించేశారు.
తిరుపతిలో రోడ్డుపై బైఠాయించి మహిళ ఆందోళన - thirupathi latest news
తిరుపతిలో రోడ్డుపై బైఠాయించి ఓ మహిళ ఆందోళన చేపట్టింది. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినా.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కన్నీటి పర్యంతమైంది.
తిరుపతిలో రోడ్డుపై బైఠాయించి మహిళ ఆందోళన