బ్యాంకుల వద్ద భౌతిక దూరం మరచిన మహిళలు - srikalahasthi latest news
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో బ్యాంకుల వద్ద రద్దీ పెరిగింది. వైఎస్సార్ చేయూత డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకుల వద్ద లబ్ధిదారులు కిక్కిరిసిపోయారు.
కరోనా వ్యాధి కరాళ నృత్యం చేస్తున్న వేళ రద్దీ ప్రాంతాల్లోనూ భౌతికదూరం పాటించాలన్న నిబంధనను మరిచిపోతున్నారు కొందరు. ప్రభుత్వం మహిళల ఖాతాల్లో వైఎస్సార్ చేయూత సొమ్ములు జమ చేయగా.. వాటిని డ్రా చేసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులతో శుక్రవారం బ్యాంకులు కిక్కిరిసి కన్పించాయి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో కొన్ని బ్యాంకుల వద్ద మహిళలను నియంత్రించడం సిబ్బందికి సాధ్యం కాలేదు. కూపన్లు ఇచ్చి వరుసల్లో నిలబెట్టేందుకు ప్రయత్నించగా ఆ కూపన్ల కోసం కూడా మహిళలు ఎగబడ్డారు.