కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా భౌతికదూరం పాటించడంలో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు కొందరు. ప్రభుత్వం ఇటీవల వేసిన నగదు తీసుకునేందుకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని బ్యాంకుల వద్ద మహిళలు క్యూకట్టారు. బ్యాంకు ఆవరణలో నిబంధనలు అమలు చేస్తూ పరిమిత సంఖ్యలో లోపలికి అనుమతిస్తున్నారు. దీంతో బ్యాంకుల వద్దకు వచ్చిన మహిళలందరూ బయట బారులు తీరారు. కరోనా భయాన్ని మరిచి గుంపులు గుంపులుగా చేరారు. చిత్తూరు జిల్లాలో తిరుపతి నగరం తర్వాత అత్యధికంగా శ్రీకాళహస్తిలో కేసులు నమోదవుతున్నాయి.
కరోనా వేళ.. నిర్లక్ష్యమేలా? - శ్రీకాళహస్తిలో కరోనా కేసులు
చిత్తూరు జిల్లాలో తిరుపతి తర్వాత అధికంగా కరోనా కేసులు శ్రీకాళహస్తిలో నమోదుఅవుతున్నాయి. కేసులు పెరుగుతున్నా ప్రజలు మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం వేసిన నగదు తీసుకునేందుకు శ్రీకాళహస్తిలోని బ్యాంకులకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. భౌతికదూరం మరిచి గుంపులుగా చేరారు.
కరోనా వేళ.. నిర్లక్ష్యమేలా?