చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాల సముద్రం మండలం టీవీఎన్ఆర్ పురంలో... నెల రోజులుగా తాగునీటి ఇబ్బందులు పడుతున్నామంటూ మహిళలు వాపోయారు. గ్రామంలో నెలకొన్న తాగునీటి విషయమై గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ... మూకుమ్మడిగా కలిసి ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. ఊర్లో కొత్తగా తవ్వించిన బోరుబావిలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ... రాజకీయాలతో తాగేందుకు నీరు దక్కడంలేదని ఆవేదన చెందుతున్నారు.
ఖాళీ బిందెలతో మహిళలు ధర్నా
గ్రామంలో రాజకీయాల కారణంగా తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నామని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాల సముద్రం మండలం టీవీఎన్ఆర్ పురం మహిళలు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఖాళీ బిందెలతో ఆ గ్రామ మహిళలంతా ధర్నాకు దిగారు.
తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళలు ధర్నా
మండల స్థాయి అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించకపోతే జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని.... అలాగే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:లైవ్: మీడియాతో మాట్లాడుతున్న తెదేపా నేత దేవినేని ఉమా