ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మదనపల్లెలో వ్యక్తి కిడ్నాప్.. ఆర్​ఐపై ఫిర్యాదు - తన భర్తను అపహరించారంటూ మదనపల్లి పోలీస్ స్టేషన్​లో మహిళ ఫిర్యాదు

ఆర్ఐ శ్రీనివాసులు, అతని కొడుకు తనీష్.. తన భర్తను అపహరించారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన ఈ ఘటనకు.. భూ వివాదమే కారణమని పోలీసులు తెలిపారు.

భూవివాదంలో వ్యక్తి అపహరణ
భూవివాదంలో వ్యక్తి అపహరణ

By

Published : Nov 18, 2020, 5:48 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం మొలకలదిన్నెలో నెలకొన్న భూవివాదం ఓ వ్యక్తి అపహరణకు దారి తీసింది. తన భర్త శ్రీరాములును కిడ్నాప్ చేశారంటూ మాధవి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్ఐ శ్రీనివాసులు, అతని కొడుకు తనీష్​లు.. ఈ అపహరణ వెనక ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వారితో పాటు కిడ్నాప్​న​కు సహకరించిన శేఖర్​బాబు, వినోద్​లపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. భూవివాదమే ఘటనకు కారణమని ఎస్సై తెలిపారు.

భూవివాదంలో వ్యక్తి అపహరణ

ABOUT THE AUTHOR

...view details