ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య - వరకట్న వేధింపులు భరించలేక నత్తం కండ్రిగలో మహిళ ఆత్మహత్య

వరకట్న వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. రెండేళ్లుగా వరకట్నం విషయంలో భార్యాభర్తలు గొడవపడేవారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది.

women commits suicide for dowry issue at chittor district
వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

By

Published : Nov 22, 2020, 3:17 AM IST

చిత్తూరు జిల్లా నత్తం కండ్రిగలో విషాద ఘటన జరిగింది. వరకట్న వేధింపులతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. నత్తం కండ్రిగకు చెందిన సతీష్​కు నారాయణవనానికి చెందిన మీనాతో 2001లో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడున్నాడు. సతీష్ ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.

రెండు సంవత్సరాలుగా అదనపు కట్నం తేవాలంటూ అతను తన భార్యను అడుగుతున్నాడు. ఈ విషయంలో శనివారం భార్యాభర్తలు మరోసారి గొడవ పడ్డారు. అనంతరం సతీశ్ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. ఇంట్లో ఎవరూ లేకపోవటంతో మీనా ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. ఆమె తండ్రి నాగిరెడ్డి ఫిర్యాదు మేరకు... వరకట్న వేధింపు చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సతీష్​ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details