ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 25, 2022, 10:14 PM IST

ETV Bharat / state

ప్రైవేట్‌ పింఛన్ల పథకం పేరుతో భారీ మోసం.. రూ.15 కోట్లు కాజేసిన మహిళ

చిత్తూరు జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రైవేట్‌ పింఛన్ల పథకం పేరుతో ఓ మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. దాదాపు 3 వేల మంది నుంచి రూ.15 కోట్లు వసూలు చేసింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో పోలీసులు నిందితురాలితోపాటు ఆమెకు సహకరించిన వారిని అరెస్టు చేశారు.

రూ.15 కోట్లు కాజేసిన మహిళ
రూ.15 కోట్లు కాజేసిన మహిళ

రూ.5 వేలు చెల్లిస్తే చాలు.. ప్రతి నెలా రూ.వెయ్యి పింఛనుగా చెల్లిస్తామని నమ్మబలికిన ఓ మహిళ.. ప్రజల నుంచి రూ.15 కోట్లు వసూలు చేసి భారీ మోసానికి పాల్పడింది. ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని వారిని నట్టేట ముంచింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. మోసానికి పాల్పడిన మహిళతోపాటు ఆమెకు సహకరించిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు కాట్పాడికి చెందిన విజయభాను అనే మహిళ ఓ సేవా సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సంస్థ పేరుతో రూ.5 వేలు ఆపైన చెల్లిస్తే.. చెల్లించిన మెుత్తాన్ని బట్టి కనిష్ఠంగా నెలకు రూ.వెయ్యి నుంచి ఆపైన జీవితాంతం పింఛను ఇస్తామని నమ్మబలికింది. మెుదట్లో కొందరికి సకాలంలో పింఛను చెల్లించి నమ్మకాన్ని పెంచుకుంది. ఇది నమ్మిన చిత్తూరు సమీప ప్రాంతం గుడిపాల, తమిళనాడులోని వేలూరు, కాట్పాడి ప్రాంతాల్లోని దాదాపు 3 వేల మంది ప్రజలు కనిష్ఠంగా రూ.5 వేల నుంచి ఎక్కువ మొత్తంలో ఆమెకు చెల్లించారు. ఇలా దాదాపు రూ.15 కోట్ల వరకు వసూలు చేసింది.

ఎక్కువ మెుత్తంలో పిఛంన్లు చెల్లించాల్సి రావటంతో కలర్ జిరాక్స్ చేసిన రూ.2 వేలు, రూ.500 నకిలీ నోట్లను రూ.44 లక్షల వరకు సిద్దం చేసింది. అయినా.. అందరికిీ ఫించన్లు అందకపోవటంతో వారు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఫించన్ల పేరుతో ఘరానా మోసం జరుగుతోందని గుర్తించారు. మోసాలకు పాల్పడిన విజయ భానుతోపాటు ఆమెకు సహకరించిన మిల్టన్, సయ్యద్ ముహమ్మద్, విష్ణు, ప్రేమ్, ఫ్రాంక్లిన్​లను అరెస్టు చేశారు.

ఇదీ చదవండి

NIA: నక్సల్స్ రిక్రూట్‌మెంట్‌.. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఎన్‌ఐఏ సోదాలు

ABOUT THE AUTHOR

...view details