చిత్తూరు జిల్లా కలికిరి మండలం మర్రికుంట పల్లి పంచాయతీ వీర్లవాండ్లపల్లిలో ఆదివారం నాటు బాంబు పేలి నాగవేణి (40) అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఉలవ చేనులో పశువులను తొలుతుండగా బాంబు పేలడంతో ఆమె కాలికి గాయమైంది. ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పేలని మరో బాంబును స్వాధీనం చేసుకున్నారు. పొలంలో అడవి పందుల కోసం బాంబులు పెట్టినట్లు తెలుస్తోందని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నాటుబాంబు పేలి మహిళకు గాయాలు - చిత్తూరు జిల్లా తాజా వార్తలు
చిత్తూరు జిల్లా కలికిరి మండం వీరవాండ్లపల్లిలో నాటు బాంబు పేలి మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నాటుబాంబు పేలి మహిళకు గాయాలు