చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బైపరెడ్లపల్లిలో ఓ మహిళా రైతు.. తహసీల్దార్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. తన పొలంలో సచివాలయ భవనం నిర్మాణానికి సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్న మహిళా రైతు... భవంతి నిర్మాణానికి వీల్లేదంటూ తేల్చి చెప్పింది. అయితే ఆ స్థలం ప్రభుత్వ రికార్డులలో.. ప్రభుత్వ భూమిగా ఉందన్న తహసీల్దార్ శ్రీనివాసులు... అధికారులను సర్వే చేయాల్సిందిగా ఆదేశించారు.
భూవివాదం: తహసీల్దార్ ఎదుట మహిళా రైతు ఆత్మహత్యాయత్నం - చిత్తూరు జిల్లాలో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
చిత్తూరు జిల్లా బైపరెడ్లపల్లిలో ఓ మహిళా రైతు తహసీల్దార్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. తన భూమిలో సచివాలయ భవనం నిర్మించేందుకు అధికారులు సర్వే చేస్తున్నారని ఆవేదన చెందిన ఆమె పురుగుల మందు తాగింది. దీంతో ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. భూవివాదంపై హైకోర్టులో కేసు నడుస్తోందని చెప్పినా.. తహసీల్దార్ పట్టించుకోలేదని మహిళ భర్త ఆరోపించారు.
Woman farmer suicide
అధికారులు సర్వే చేస్తున్నారని భావోద్వేగానికి లోనైన మహిళా రైతు హారతి...తహసీల్దార్ ఎదుటే పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను హుటాహుటిన కుప్పం పీఈఎస్కు తరలించారు. ఈ భూవివాదంపై హైకోర్టులో కేసు ఉందని చెప్పినా.. తహసీల్దార్ తమ మాట వినలేదంటూ బాధితురాలి భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:తెలంగాణ: మాస్కులు, శానిటైజర్ల పేరుతో రూ.24 లక్షల మోసం
Last Updated : Dec 9, 2020, 5:07 PM IST