చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం ముత్తుకూరు గ్రామంలో ఓ మహిళ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. ముత్తుకూరు గ్రామానికి చెందిన మహిళ పశువులకు మేత కోసం వేరేవాళ్ల పొలాల్లోకి వెళ్లి ... ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో గుర్తించలేదు. కాసేపటి తరువాత పొలం యజమాని బావి వద్దకు వచ్చి... ఆమె మృతి చెందిన విషయాన్ని గుర్తించాడు. వెంటనే మృతురాలి కుమార్తెకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళ మృతి - ముత్తుకూరులో బావిలో పడి మహిళ మృతి
ఆవుల్ని మేపేందుకు పొలానికి వెళ్లిన ఓ మహిళ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా ముత్తుకూరు గ్రామంలో జరగ్గా... బాధితులు ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
![ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళ మృతి Woman dies after falling into well at muthukuru village in chittoor district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7850733-747-7850733-1593611938568.jpg)
చిత్తూరు జిల్లా ముత్తుకూరులో బావిలో పడి మహిళ మృతి