విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల దగ్గర లక్షలు దండుకున్న మాయలేడిని చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీసులు... విజయవాడలో గురువారం అదుపులోకి తీసుకున్నారు. తిరుపతికి చెందిన సంధ్య నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని... విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నాయుడుపేటకు చెందిన పవన్‌కుమార్ వద్ద నుంచి రూ.14 లక్షలు తీసుకుంది. కొద్ది రోజులకు మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు చంద్రగిరి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... తమ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితురాలు విజయవాడలో ఉన్నట్లు గుర్తించి... గురువారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడినుంచి చంద్రగిరికి తీసుకొచ్చి... కడప సెంట్రల్ జైల్‌కు తరలించారు. ఆమెపై గుంటూరులో రెండు చీటింగ్ కేసులు పెండింగులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
విదేశాల్లో ఉద్యోగం పేరిట మోసం... ఆపై ఇలా! - చిత్తూరు జిల్లా తాజా వార్తలు
నిరుద్యోగులే ఆమెకు టార్గెట్... తీయటి మాటలు చెప్పి.. విదేశాలకు పంపిస్తానంటూ డబ్బులు గుంజుకుని మోసం చేయడం ఆమె వృత్తి. ఓ వ్యక్తి ఫిర్యాదుతో మాయలేడి మోసాలు బయటపడ్డాయి.
![విదేశాల్లో ఉద్యోగం పేరిట మోసం... ఆపై ఇలా! Woman arrested over job fraud at chandragiri in chittoor district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7682799-807-7682799-1592560649030.jpg)
విదేశాల్లో ఉద్యోగం పేరిట మోసం చేసిన మహిళ అరెస్టు