తమిళనాడులోని అరక్కోణం బంగారమ్మన్ కండిగైకు చెందిన జె.ఉమామహేశ్వరి అలియాస్ షాలిని.. కైనూర్ పంచాయతీ సర్పంచిగా ఉంటూ రవిశంకర్ అలియాస్ రమేష్ ప్రభాకర్, రాజేష్ అలియాస్ విజయ్, నరేష్ అలియాస్ కార్తీక్, శ్రీకాంత్, శ్రీనివాసన్, అయ్యప్పన్, రామరాజ్, దినకరన్, సయ్యద్ అలీతో ఒక ముఠా ఏర్పాటు చేసింది.
అమాయకులను నమ్మించి భూమి తాకట్టు పెట్టుకుని డబ్బులు అప్పుగా ఇస్తామని ఈ ముఠా సభ్యులు నమ్మిస్తారు. ఒప్పందం కుదిరాక భూమి రిజిస్ట్రేషన్, స్టాంపు రుసుం చెల్లించడానికి ముందుగా కొంత నగదు ఇవ్వాలని చెబుతారు. తమకు అవసరానికి డబ్బు అందుతుందని నమ్మి, వారు అడిగిన నగదు ఇచ్చే సమయానికే సరిగ్గా పోలీసు దుస్తుల్లో ఉన్న కొందరు నకిలీ పోలీసులు.. వాహనంలో అక్కడికొచ్చి, వారిని బెదిరించి నగదు అపహరిస్తారు.