ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

suhasini arrest: నిత్య పెళ్లికూతురు సుహాసిని అరెస్ట్.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! - తిరుపతిలో నిత్య పెళ్లికూతురు సుహాసిని అరెస్ట్

ఆమె కవ్విస్తూనే సర్వం దోచే రకం. అనాథనంటూ నంగనాచి కబుర్లు చెప్తుంది. మాటలు కలిపి ముగ్గులోకి దించుతుంది. పెళ్లి చేసుకుని ఉన్నదంతా ఊడ్చేసుకుని ఉడాయిస్తుంది. అలా ముగ్గుర్ని మనువాడిన నిత్యపెళ్లి కూతురు.. చివరికి పోలీసులకు చిక్కింది. అసలు ట్విస్ట్ తెలుసుకున్న పోలీసులు షాక్ తిన్నారు.

woman arrest  who was getting  multiple marriage at tirupathi
తిరుపతిలో నిత్య పెళ్లికూతురు సుహాసిని అరెస్ట్

By

Published : Jul 14, 2021, 1:32 PM IST

తిరుపతిలో నిత్య పెళ్లికూతురు అరెస్ట్

తిరుపతిలో చర్చనీయాంశంగా మారిన నిత్య పెళ్లికూతురు సుహాసిని(suhasini case)ని.. పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. పెళ్లిచేసుకొని మోసగించిందంటూ మూడో భర్త సునీల్‌కుమార్‌.. జూన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి ఆ మాయలేడి కోసం గాలించారు. రెండేళ్ల క్రితం పెళ్లిచేసుకుని మోసం చేసిందని రెండో భర్త వినయ్‌ ఫిర్యాదు చేశారు. విస్తృతంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. చివరికి ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

పోలీసులే షాక్ తిన్నారు...

విచారణ క్రమంలో .. సుహాసిని వలపు వలలు తెలుసుకుని పోలీసులే నివ్వెరపోయారు. మొదట.. అనాథనంటూ యువకులతో మాటలు కలుపుతుంది. పరిచయం పెరిగాక.. ప్రేమిస్తున్నానంటూ ముగ్గులోకి దించుతుంది. తీరా పెళ్లయ్యాక.. భర్త వద్ద ఉన్న నగదు, నగలతో పరారవడాన్ని సుహాసిని అలవాటుగా మార్చుకుంది.. అని పోలీసులు గుర్తించారు.

సునీల్ కన్నా ముందు మరో ఇద్దరిని సుహాసిని.. ఇదే తరహాలో పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణలోని మణుగూరులో రెండో భర్త అయిన వినయ్‌ అనే వ్యక్తిని సైతం ఇలాగే ఛీట్ చేసినట్టు చెప్పారు. అసలు ట్విస్ట్ ఏంటంటే... ఇదంతా మొదటి భర్త సహకారంతోనే సుహాసిని చేస్తోందని తెలుసుకుని అవాక్కయ్యారు.

ఇదీ చూడండి:

suhasini case: సుహాసిని కేసులో మరో ట్విస్ట్​.. తెరపైకి రెండో భర్త

ABOUT THE AUTHOR

...view details