ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ సీసాతో మహిళ ఆందోళన - చిత్తూరు జిల్లా నేటి వార్తలు

చిత్తూరు జిల్లా రామకుప్పం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ సీసాతో ఓ మహిళ ఆందోళన చేసింది. తనకు న్యాయం చేయకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు.

Woman agitated with patrol bottle in front of tahsildar's office i nramakuppam
తహశీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ సీసాతో మహిళ ఆందోళన

By

Published : May 1, 2020, 8:17 PM IST

చిత్తూరు జిల్లా రామకుప్పం మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో పెట్రోల్ సీసాతో ఓ మహిళ హల్​చల్​ చేసింది. తనకున్న 65 సెంట్ల భూమిని ఆక్రమించుకున్నా... అధికారులు చర్యలు తీసుకోలేదని నక్కబాలయ్యపల్లెకు చెందిన సునంద వాపోయింది. పెట్రోల్‌ సీసాతో ఆందోళన చేసింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని, సమస్య పరిష్కారనానికి ఆర్‌.ఐ, వీఆర్‌ఓ లంచం అడిగారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయకుంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details