తిరుమలలో భక్తుల సంచారం లేకపోవడంతో వన్యప్రాణులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో శ్రీవారి దర్శనానం నిలిపివేయడంతో పాటు వాహనాల రాకపోకలను నిషేధించారు. నిత్యం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయే తిరుమల... నిర్మానుష్యమైంది. ఫలితంగా చీకటి వేళల్లో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. తిరుమల గోగర్భం జలాశయం సమీపంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.
తిరుమల కొండల్లో యథేచ్ఛగా వన్యప్రాణుల సంచారం - తిరుమలలో లాక్‌డౌన్ ప్రభావం
లాక్డౌన్తో తిరుమలలో భక్తుల దర్శనం నిలిపివేశారు. కొండపైకి ఎవరినీ అనుమతించడం లేదు. ఫలితంగా ఏడుకొండలు నిర్మానుష్యంగా మారాయి. జనసంచారం లేకపోవడంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. యథేచ్ఛగా సంచరిస్తున్నాయి.
తిరుమలలో పులి సంచరిస్తున్న దృశ్యం