ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అడ్డు తగులుతున్నాడని.. అంతమొందించారు - ఎంకేపురంలో భర్తను చంపిన భార్య తాజా వార్తలు

తాగొచ్చి గొడవ పడుతున్నాడని..తన విహహేతర సంబంధానికి అడ్డుతగులుతున్నాడని కుమారుడు, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య. ఈ ఘటన చిత్తూరు జిల్లా ఎంకేపురం సమీపంలో జరిగింది.

wife killed   husband at enkepuram
ఎంకేపురంలో భర్తను చంపిన భార్య

By

Published : Oct 3, 2020, 11:39 AM IST

మద్యం వ్యసనానికి బానిసగా మారి నిత్యం వేధిస్తుండటంతో పాటు తన వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతున్నాడని కోపాన్ని పెంచుకున్న భార్య..భర్తను చంపింది. కుమారుడు, ప్రియుడితో కలిసి ప్లాన్ వేసి... అంతమొందించింది. గత నెల 27న చిత్తూరు జిల్లా ఎంకేపురం సమీపంలోని బురదకుంట చెరువులో కర్ణాటకకు చెందిన శంకర్‌ (40) మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందజేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. శంకర్‌ హత్యకు గురైనట్లు తేలింది. కర్ణాటక పరిధిలోని ఎర్రవంకలు (మిట్టకొత్తూరు)కు చెందిన శంకర్‌కు భార్య జ్యోతి, కుమారుడు అరుణ్‌కుమార్‌ ఉన్నారు.

శంకర్‌ మద్యం వ్యసనపరుడు కావడం.. జ్యోతికి అదే గ్రామానికి చెందిన శివకుమార్‌తో వివాహేతర సంబంధం ఉండటం వల్ల తరచూ గొడవలు జరుగుతుండేవి. భర్త అడ్డును తొలగించుకోవాలని భావించిన జ్యోతి.. కుమారుడు అరుణ్‌కుమార్‌, ప్రియుడు శివకుమార్‌తో కలిసి హత్యకు ప్రణాళిక రచించారు. గత నెల 23న రాత్రి మద్యం మత్తులో నిద్రిస్తున్న శంకర్‌ మెడకు తాడును బిగించి చంపేశారు. మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై ఎంకేపురం బురదకుంట చెరువు వద్దకు తీసుకొచ్చి... నడుముకు రాయిని కట్టి నీటిలో పడేశారు. కేసు దర్యాప్తులో భాగంగా.. జ్యోతి (35) ఆమె కుమారుడు అరుణ్‌కుమార్‌ (20), శివకుమార్‌(29)ను శుక్రవారం అరెస్టు చేసి కుప్పం న్యాయస్థానంలో హాజరు పరిచారు. హత్య కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ, ఎస్సై, పోలీస్‌ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

ఇదీ చూడండి.విజయవాడలో వృద్ధురాలు అనుమానాస్పద మృతి

ABOUT THE AUTHOR

...view details