CYBER CHEATING :మీకు నెల నెల జీతమిచ్చే మీ యాజమానే...అత్యవసరమని మిమ్మల్ని డబ్బు అడగవచ్చు. మీరు ఎంతగానే అభిమానించే నాయకుడి నుంచే 50 వేలు కావాలంటూ సందేశం రావచ్చు. అదేంటి వాళ్లు మమ్మల్ని ఎందుకు అడుగుతారనే కదా మీ సందేహం. రాజ్‌భవన్‌లో పనిచేసే ఉద్యోగిని ఏకంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సాయం కోరగా లేనిది.. మీకు తెలిసిన పెద్దలు డబ్బు పంపించమని వాట్సాప్‌లో అడగడంలో వింతేముంది చెప్పండి.
అందివచ్చిన సాంకేతికతను వాడుకుంటూ ఎప్పటికప్పుడూ సరికొత్త నేరాలకు తెర తీసే సైబర్ మోసగాళ్లు.. తాజాగా వాట్సాప్‌ను తమ నయా అస్త్రంగా ఎంచుకుంటున్నారు. ప్రముఖులు, రాజకీయ నాయకులు, అధికారులు తదితరుల ఫొటోల నకిలీ ఖాతాలతో డబ్బు కావాలనే సందేశాలు పంపిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ ఉద్యోగికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఫొటో, పేరు ఉన్న ఒక నెంబరు నుంచి వాట్సాప్ సందేశం రాగా.. అధికారులు ఆరా తీయగా ఆ నంబర్ రాజస్థాన్‌లో ఉన్నట్లు తేలింది. గుంటూరులో విధులు నిర్వహిస్తున్న ఓ యువ ఐఏఎస్ అధికారి వాట్సాప్ ఖాతా నుంచి 20 వేలు కావాలంటూ కొంతమందికి సందేశాలు రావడం, వాళ్లు డబ్బు పంపించడం, సైబర్ నేరగాళ్ల పని అని ఆ తరువాత గుర్తించడం జరిగింది .