తిరుగిరులు సరికొత్త శోభ సంతరించుకొన్నాయి. కురుస్తున్న వర్షాలకు శేషాచలం అటవీప్రాంతంలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఎగువన కురిసిన భారీ వర్షంతో ఒకటో కనుమ రహదారిలో ఉన్న మాల్వాడి గుండం జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శ్రీవారి పాదాల చెంత ఉన్న కపిలతీర్థం జలపాతం భక్తులకు కనువిందు చేస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకొని... తిరుగు ప్రయాణమైన భక్తులు మాల్వాడిగుండం జలపాతం వద్ద ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. జలపాతంలో స్నానమాచరిస్తున్నారు. ఏడుకొండల్లో పరచుకొన్న పచ్చదనం... ఎత్తైన ప్రాంతం నుంచి దూకుతున్న జలం భక్తులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది.
సరికొత్త శోభ సంతరించుకున్న తిరుగిరులు - మాల్వాడి గుండం జలపాతం
కురుస్తున్న వర్షాలకు అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్న కపిలతీర్థం జలపాతం భక్తులకు కనువిందు చేస్తోంది.
సరికొత్త శోభ సంతరించుకున్న తిరుగిరులు
Last Updated : Jun 25, 2019, 9:34 PM IST