చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కళ్యాణి డ్యామ్ జలకళ సంతరించుకుంది. డ్యామ్ నీటి మట్టం పదిహేను నుంచి ఇరవై అడుగుల మేర పెరిగింది. అనంకోన, రాగిమాకుల వంటి వాగుల నుంచి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. గతంలో కళ్యాణి డ్యామ్ నుంచి తిరుమల తిరుపతి కి నీటిని సరఫరా చేసేవారు. తిరుమలకు వచ్చిన యాత్రికులకు... తిరుపతిలోని ప్రజలకు దాహార్తిని తీర్చేది. డ్యాంలో నీరు అడుగంటిపోవడంతో నెల రోజుల నుంచి సరఫరా నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ నీరు చేరటంతో అందరిలోనూ ఆనందం వ్యక్తమవుతోంది. జలకళతో అప్పుడే పర్యాటకుల తాకిడి మొదలైంది. చంద్రగిరి మండలం లోని వాగులు వంకలు పరవళ్ళు తొక్కుతున్నాయి. వర్షాలు ఇలాగే కొనసాగితే కళ్యాణి డ్యామ్ నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంటుందని... ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు.
వర్షపు నీటితో జలకళ సంతరించుకున్న కళ్యాణి డ్యాం - water level increased in kalyani dam
వర్షపు నీటితో చిత్తూరు జిల్లాలోని కళ్యాణి డ్యాం కళకళలాడుతోంది. నెల రోజుల క్రితం వరకు నీరులేక వెలవెలబోయిన జలాశయం... రెండు ఇటీవల కురుస్తున్న వర్షాలతో జలకళ సంతరించుకుంది. 15 అడుగుల మేర పెరిగన నీటిమట్టం పెరిగింది.
వర్షపు నీటితో కళ్యాణి డ్యాంకు జలకళ
TAGGED:
kalyani dam