చిత్తూరు జిల్లా మదనపల్లె శివారులోని లాభాల గంగమ్మ గుడి వద్ద బోరుబావిలో... నీళ్లు పైకి ఎగసిపడుతున్నాయి. ఆరు నెలల క్రితం అంతంతమాత్రంగా వచ్చే నీరు... ప్రస్తుతం మోటారు వేయకపోయినా ఉబికివస్తోంది. నీరు పైకి ఎగసిపడుతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
పెరిగిన భూగర్భ జలాల మట్టం... బోరుబావిలో పొంగుతున్న నీరు - చిత్తూరు జిల్లా నేటి వార్తలు
చిత్తూరు జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో... భూగర్భ జలాల మట్టం గణనీయంగా పెరుగుతోంది. పశ్చిమ మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండి పారుతుండటంతో పరిసర ప్రాంతాల్లోని బోరుబావుల్లో నీటి మట్టం పెరుగుతోంది.

బోరుబావిలో పొంగుతున్న నీరు