చిత్తూరు జిల్లా చంద్రగిరి తహసీల్దార్ కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని వీఆర్వోలు... ఎమ్మార్వోకు మొరపెట్టుకున్నారు. రాత్రి పదకొండు గంటల వరకు విధులు నిర్వర్తించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై వారు ఎమ్మార్వోతో మాట్లాడారు.
పని ఒత్తిడి తగ్గించాలని ఎమ్మార్వోకు వీఆర్వోలు మొర - work pressure of vro's news
ప్రజల అవసరం నిమిత్తం ఎంత సమయమైనా కార్యాలయంలో ఉండి పనిచేయాల్సిందే అని చిత్తూరు జిల్లా చంద్రగిరి తహసీల్దార్ వీఆర్వోలతో అన్నారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉందన్న ఫిర్యాదుపై ఆయన స్పందించి... ప్రజల కోసం సమయం కేటాయించాలని సూచించారు.
తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోలు
ప్రజల అవసరాలకు పని చేసే సమయంలో ఇలాంటి ఇబ్బందులు తప్పవని.. సిబ్బంది సహకరించాలని ఎమ్మార్వో కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని అన్నారు. ఈ క్రమంలో ఎక్కువ సమయం విధులకు కేటాయించాల్సి ఉంటుందని... భారంగా కాకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఇదీ చదవండి: తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ భవనం ఎదుట ఉద్యోగుల నిరసన