ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యపై వీఆర్వో బండరాయితో దాడి... తీవ్రగాయాలు - రెడ్డివారిపల్లిలో బండరాయితో భార్యను హతమార్చాలని చూసిన వీఆర్వో

స్టేషన్​లో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపిన కొద్దిసేపటికే భార్యపై బండరాయితో దాడిచేశాడు ఓ వీఆర్వో. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లిలో ఈ ఘటన జరిగింది. దంపతుల మధ్య ఏర్పడిన మనస్పర్థలే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు.

vro attack on wife at reddyvaripalli, vro murder attempt on wife at reddyvaripalli
రెడ్డివారిపల్లిలో భార్యపై బండరాయితో వీఆర్వో దాడి, భార్యపై వీఆర్వో హత్యాయత్నం

By

Published : Mar 28, 2021, 7:20 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లిలో.. భార్య రాజ్యలక్ష్మిపై తిరుపతి రూరల్​ మండలంలో వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న శివకుమార్ బండరాయితో దాడిచేశాడు. స్టేషన్​లో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం తిరిగి ఇద్దరూ ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. తీవ్రగాయాలపాలైన బాధితురాలిని పోలీసులు రుయా ఆస్పత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదుతో విచారణ చేపట్టారు.

శివకుమార్, రాజ్యలక్షి మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో శనివారం గొడవ పడ్డారు. భర్త వైఖరితో విసిగిపోయిన భార్య పోలీసులకు సమాచారం అందించింది. ఈ క్రమంలో వీఆర్వోను స్టేషన్​కు పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా మళ్లీ వివాదం తలెత్తడంతో తనపై దాడికి దిగినట్లు బాధితురాలు పేర్కొంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details