ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చంద్రగిరి ఎమ్మార్వో కార్యాలయం ముందు వీఆర్ఏలు నిరసన చేపట్టారు. పాదయాత్రలో వీఆర్ఏలకు జీతభత్యాలు పెంచి ప్రమోషన్లు కల్పిస్తామన్నారని గుర్తు చేశారు.
అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని... లేని పక్షంలో నిరసనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.