తిరుమల శ్రీవారిని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. నైవేథ్యం ఘంట సమయంలో ఆలయానికి చేరుకున్న స్వాత్మానందేంద్రకు తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. 2019 బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్‌లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. శిక్షణలో భాగంగా తిరుమల భద్రతా వ్యవహారాలను తెలుసుకునేందుకు వచ్చిన 26 మంది ట్రైనీ ఐపీఎస్‌లు స్వామివారి ఆశీస్సులను పొందారు.
శ్రీవారి సేవలో శారదాపీఠం ఉత్తరాధికారి, 26 మంది ట్రైనీ ఐపీఎస్‌లు - తిరుమల వార్తలు
తిరుమల శ్రీవారి సేవలో విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, 2019 బ్యాచ్ 26 మంది ట్రైనీ ఐపీఎస్‌లు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలను అందజేశారు.

శ్రీవారి సేవలో శారదాపీఠం ఉత్తరాధికారి, 26 మంది ట్రైనీ ఐపీఎస్‌లు