ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TTD: తితిదే బోర్డును త్వరలో ప్రకటిస్తాం: మంత్రి వెల్లంపల్లి

తిరుమల శ్రీవారిని మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, శ్రీరంగనాథరాజు, పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.74 కోట్లుగా సమకూరింది

vips visits tirumala
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

By

Published : Jul 7, 2021, 10:00 AM IST

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, రంగనాథరాజు, పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ప్రముఖులకు తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కరోనా సమయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా తితిదే దర్శనం కల్పిస్తోందని... తితిదే బోర్డును త్వరలో నియమిస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. పేద ప్రజలందరికీ ఇళ్లు నిర్మించే కార్యక్రమం జరుగుతోందని... అన్ని జిల్లాల్లో ఇళ్ల నిర్మాణాలను పరిశీస్తున్నట్లు తెలిపారు

నిన్న శ్రీవారిని 16,984 మంది భక్తులు దర్శించుకున్నారు. 7,642 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.74 కోట్లు సమకూరింది.

హైదరాబాద్‌ భక్తుడి విరాళం

తిరుమల శ్రీవారి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు కోటి రూపాయల విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన‌ భవ్యా గ్రూప్ చైర్మన్ ఆనంద్ ప్రసాద్ కోటి రూపాయ‌లు విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో ధర్మారెడ్డికి విరాళానికి సంబంధించిన డీడీలను దాత అందజేశారు.

ఇదీ చూడండి.కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తెలుగు ఎంపీలకు ఆశలు

ABOUT THE AUTHOR

...view details