తిరుమల శ్రీవారిని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందని శ్రీనివాసరాజు ఆనందం వ్యక్తం చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలోనే ఇలాంటి అరుదైన గుర్తింపు వచ్చిందని.. అందుకే తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడం కోసం వచ్చానని తెలిపారు.
మరోవైపు.. ఉద్యోగులకు సకాలంలో జీతాలు రావాలని స్వామివారిని వేడుకున్నట్లు ఎపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు సకాలంలో జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 11వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, హామీలను ముఖ్యమంత్రి నేరవేర్చాలని డిమాండ్ చేశారు.