తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఏపీ హెచ్‌ఈఆర్‌సీఎంసీ ఛైర్మన్ జస్టీస్ ఈశ్వరయ్య, తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి, పొగాకు బోర్డు ఛైర్మన్ రఘునాథబాబు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఇవాళ్టి నుంచి వీఐపీ దర్శనం ప్రారంభించిన తితిదే... ప్రోటోకాల్ ప్రకారం ప్రముఖులకు మాత్రమే టికెట్లను కేటాయిస్తోంది. రోజూ ఉదయం ఆరున్నర గంటల నుంచి గంట సమయం పాటూ వీఐపీ దర్శనానికి సమయం ఇవ్వనుంది. అన్ని జాగ్రత్తలూ పాటిస్తూ భక్తులకు స్వామివారి దర్శనం కల్పింస్తోందని.. తితిదేను ప్రముఖులు అభినందించారు.
తిరుమలేశుడి సేవలో ప్రముఖులు - తిరుమల వీఐపీ దర్శనం వార్తలు
ఇవాళ్టి నుంచి వీఐపీ దర్శనాన్ని తితిదే ప్రారంభించింది. ఈ మేరకు పలువురు ప్రముఖులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అన్ని జాగ్రత్తలూ పాటిస్తూ... శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తోందని ప్రముఖులు అభినందించారు.
![తిరుమలేశుడి సేవలో ప్రముఖులు VIPs visited Sri Venkateswara Swamy temple in tirumala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7567002-670-7567002-1591849826468.jpg)
VIPs visited Sri Venkateswara Swamy temple in tirumala