ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సుందరనాయుడి భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు - చిత్తూరు జిల్లా లేటెస్ట్ అప్​డేట్స్

పౌల్ట్రీ రంగ దిగ్గజం సుందరనాయుడి భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన సేవలు మరువలేనివని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తీరని లోటన్నారు. సుందరనాయుడు కుమార్తె, మార్గదర్శి ఎండీ శైలజను ఓదార్చారు.

VIPs tributes to Sundaranayudu
సుందరనాయుడి భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు

By

Published : Apr 30, 2022, 3:28 PM IST

సుందరనాయుడి భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు

పౌల్ట్రీ రంగ దిగ్గజం సుందరనాయుడు మృతి.... తీరని లోటు అని పలువురు ప్రముఖులు ఆయన సేవల్ని గుర్తుచేసుకున్నారు. చిత్తూరు సుందరనగర్‌లోని సుందరనాయుడు స్వగృహంలో..... ఆయన భౌతికకాయానికి.. నివాళులర్పించారు. ఇవాళ.. సినీ నటుడు మోహన్‌బాబు, మాజీ మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి, అమరరాజా గ్రూపు సంస్థల ఛైర్మన్ గల్లా రామచంద్రనాయుడు, అమరరాజా ఆస్పత్రి ఎండీ గౌరినేని రమాదేవి, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, ఇతర ప్రముఖులు.... సుందరనాయుడు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. సుందరనాయుడు కుమార్తె, మార్గదర్శి ఎండీ శైలజను ఓదార్చారు. వేల మంది రైతులు, యువతను కోళ్ల పరిశ్రమవైపు నడిపించి... వారి జీవితాల్లో వెలుగులు నింపిన మార్గదర్శి... సుందరనాయుడని కొనియాడారు..

ఇదీ చదవండి:గుక్కెడు నీటి కోసం... గిరిజన గ్రామాల అవస్థలు

ABOUT THE AUTHOR

...view details