తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో రాష్ట్ర మంత్రి శంకర్ నారాయణ, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు, తూర్పునౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్‌జైన్ స్వామివారి సేవలో పాల్గొన్నారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థిచినట్లు మంత్రి తెలిపారు. దేశం అభివృద్ది వైపు నడిచి ఆర్థిక ప్రగతి సాధించాలని కోరుకున్నానన్న జీవీఎల్... అయోధ్యలో రామమందిర నిర్మాణంతో అనేక శతాబ్దాలుగా కల నెరవేరబోతుందన్నారు.