తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, తిరుపతి తెదేపా ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ, మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వామివారి సేవలో పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - tirumala programs latest news
తిరుమల శ్రీవారివారి సేవలో ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, తిరుపతి తెదేపా ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ, మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుపతి ఎంపీ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేయాలని నిమ్మల రామానాయుడు కోరారు. ఓటర్లు భయంతో కాకుండా.. బాధ్యతతో ఓటు వేయాలని సూచించారు. తిరుమల, తిరుపతి పవిత్రతను కాపాడాలంటే తెదేపా అభ్యర్థిని గెలిపించాలన్నారు.
ఇదీ చదవండి: తిరుపతి ఉప ఎన్నికకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ