తిరుమల శ్రీవారిని నేడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కుటంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, దువ్వాడ శ్రీనివాస్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులకు తితిదే ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు - తిరుపతి వార్తలు
తిరుమల శ్రీవారిని నేడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, దువ్వాడ శ్రీనివాస్ స్వామివారి సేవలో పాల్గొన్నారు.

శ్రీవారి సేవలో ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్ రెడ్డి