తిరుమల శ్రీవారిని నేడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు పెద్దారెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ ఆధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో