ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యాలెట్ బాక్సుల తరలింపునకు అధికారుల యత్నం.. బైఠాయించిన గ్రామస్థులు - చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైలులో ఉద్రిక్తత

సాంకేతిక సమస్యలతో మరో కౌంటింగ్‌ కేంద్రానికి బ్యాలెట్ బాక్సుల తరలింపును గ్రామస్థులు అడ్డుకున్నారు. పేపర్ కౌంటింగ్​కు ఇంటర్ నెట్ ఎందుకంటూ.. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైలులో జరిగింది.

protest on counting issue at kollabailu panchayat
బ్యాలెట్ బాక్సుల తరలింపుకు అధికారుల యత్నం

By

Published : Feb 13, 2021, 5:51 PM IST

బ్యాలెట్ బాక్సుల తరలింపునకు అధికారుల యత్నం

రెండో దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం కోళ్లబైలు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. కోళ్లబైలులో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో రెండో దశ పోలింగ్‌ జరిగింది. ఓటింగ్ ముగిసిన తరువాత ఓట్ల లెక్కింపు కోసం బ్యాలెట్ బాక్సులను 2కిలోమీటర్ల దూరంలోని బైరెడ్డి కాలనీకి తరలించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. దీన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు.

సిగ్నల్స్, నెట్ వర్క్ సమస్య కారణంగానే లెక్కింపు కేంద్రం మార్చాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. అయితే.... బ్యాలెట్​ పేపర్ కౌంటింగ్​కు ఇంటర్ నెట్ ఎందుకంటూ గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. గ్రామంలోనే కౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పోలీసులు, ఎన్నికల అధికారులు.. గ్రామస్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

ఇదీ చదవండి:లోకల్ రిజల్ట్: వెలువడుతున్న రెండవ దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details